పయనించే సూర్యుడు జనవరి 18 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య :అంగరంగ వైభవంగా మొలంగూర్ గ్రామంలోని శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు భాగంగా శనివారం తెల్లవారుజామున ఆలయ ప్రాంగణంలో ఆశేష భక్తజనం నడుమ ఆలయ ప్రధాన అర్చకులు గొల్యాల గంగాధర స్వామి, ఆయన తనయుడు కన్నయ్య ఆధ్వర్యంలో అగ్ని గుండాలు, స్వామి వారి కళ్యాణం నిర్వహించారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు నియోజకవర్గం శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామంలో గల కాకతీయుల, నిజాం కాలం కోరిన కోరికలు తీర్చి భక్తుల ఇళ్లలో కొంగు బంగారం వెలిచే శ్రీ భద్రకాళి సమేత వీరభద్రస్వామి, 2026 బ్రహ్మోత్సవాలు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని నిర్వహించడం జరుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలు భాగంగా ఆలయ ప్రధాన అర్చకులు గంగాధర స్వామి ఆధ్వర్యంలో శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి ఉత్సవమూర్తులకు ఆశేష భక్తజనం నడుమ అంగరంగ వైభవంగా కళ్యాణాన్ని వేద పండితుల మంత్రోత్సవాల నడుమ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పూదరి రాజు, మాజీ సర్పంచులు దండు సాయిలు, మోరె అనూష శ్రీనివాస్, నరహరి శారద బుచ్చిరెడ్డి, మాజీ ఎంపీటీసీ వావిలాల రాజు, రాయిని లలితా దేవి శంకరయ్య,ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ పుల్లూరి వీరేశం, అభివృద్ధి కమిటీ సభ్యులు, ప్రజా ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, ఆశ భక్తజనం పాల్గొన్నారు