అభివృద్ధికి రోల్ మోడల్ జగపతిరావుకరీంనగర్ ను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాం

* కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ వెలిచాల రాజేందర్ రావు

పయనించే సూర్యుడు జనవరి 18 కరీంనగర్ న్యూస్: వందలాది మంది కాంగ్రెస్ లో చేరిక వెలిచాల ఆధ్వర్యంలో రోజురోజుకు కాంగ్రెస్ బలోపేతం కార్యకర్తల కోలాహలం కళకళలాడుతున్న వెలిచాల ప్రజాభవన్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలంతా పట్టం కట్టాలని తద్వారా కరీంనగర్ పట్టణాన్ని తెలంగాణ రాష్ట్రంలోనే అత్యద్భుతంగా తీర్చిదిద్దుతామని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గా ఇన్చార్జి వెలిచాల రాజేందర్ రావు పేర్కొన్నారు. కరీంనగర్ పట్టణాన్ని గత బిఆర్ఎస్ పాలకులు బ్రష్టు పట్టించారని అవినీతిలో గిన్నిస్ బుక్ రికార్డు సృష్టించారని మండిపడ్డారు. కరీంనగర్ అభివృద్ధిలో మా తండ్రి జగపతిరావు రోల్ మోడల్ గా నిలిచారని పేర్కొన్నారు కొత్తపెళ్లిలోని వెలిచాల ప్రజా కార్యాలయంలో శనివారం సాయంత్రం బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు వందలాదిమంది వెలిచాల రాజేందర్ రావు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. రేకుర్తికు చెందిన టిఆర్ఎస్ నాయకుడు అస్తపురం మారుతి ఆధ్వర్యంలో 200 మంది నాయకులు కార్యకర్త కార్యకర్తలు రాజేంద్ర రావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ లో చేరారు. వారందరికీ రాజేందర్ రావు కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. దీంతోపాటు 12వ డివిజన్ కు చెందిన తెల్ల రమేష్ ఆధ్వర్యంలో 50 మంది కాంగ్రెస్ లో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో రాజేందర్రావు మాట్లాడుతూ గత బిఆర్ఎస్ పాలకుల వల్ల కరీంనగర్ అన్ని రంగాల్లో బ్రష్టు పట్టిందని అవినీతిలో కేరాఫ్ అడ్రస్ గా కరీంనగర్ ను నిలిపారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలంతా పట్టం కట్టాలని అభివృద్ధి అంటే ఎలా ఉండాలో చేసి చూపిస్తామని స్పష్టం చేశారు. మా తండ్రి మాజీ ఎమ్మెల్యే జగపతిరావు కరీంనగర్ అభివృద్ధి దిక్సూచి అని వాడవాడలో ఎక్కడికి వెళ్లినా జగపతిరావు చేసిన అభివృద్ధిని ప్రజలంతా గుర్తు చేస్తున్నారని తెలిపారు. కరీంనగర్ నియోజకవర్గంలో జగపతిరావు కృషివల్లే ప్రతి అభివృద్ధి పని జరిగిందని రాజేందర్రావు పేర్కొన్నారు. నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 294 ఎమ్మెల్యేల్లో ఏ ఎమ్మెల్యే మా తండ్రి జగపతిరావు వలె అభివృద్ధి చేయలేదని అందుకు తనయుడుగా తాను ఆనంద పడుతున్నానని పేర్కొన్నారు. కరీంనగర్ లో బిజెపి బీఆర్ఎస్ మ్యాచ్ ఫిక్సింగ్ కు పాల్పడుతున్నాయని ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో ఇరు పార్టీలు లోపాయికారిగా ఒప్పందం చేసుకున్నాయని మండిపడ్డారు. ప్రజలంతా బిఆర్ఎస్ బిజెపి పార్టీలకు గట్టి బుద్ధి చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన నాయకులు కార్యకర్తలను మనస్పూర్తిగా అభినందిస్తున్నానని వార్డుల్లో కష్టపడి పనిచేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని రాజేందర్ రావు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మాజీ ప్రజా ప్రతినిధులు ముఖ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజేందర్ రావు ఆధ్వర్యంలో రోజురోజుకు కాంగ్రెస్ పార్టీలో చేరికలు ఊపందుకు ఉన్నాయి. దీంతో వెలిచాల ప్రజాభవన్ కళకళలాడుతోంది. కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నెలకొంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *