ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వందేవదాయ ధర్మ దాయ శాఖశ్రీ గండి పోశమ్మ అమ్మవారి దేవస్థానం.

పయనించే సూర్యడు దేవీపట్నం మండలం సాగర్ జనవరి. 18.2026 పోలవరం జిల్లా రంపచోడవరం నియోజకవర్గం దేవీపట్నం మండలం పూడిపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న గొందూరు గ్రామం గోదావరి నదిలో వరద నీరు అధికంగా ఉండడం వలన గొందూరు గ్రామంలో వేంచేసియున్న స్వయంభూ శ్రీ గండి పోశమ్మ అమ్మవారి ఆలయం వద్ద గోదావరి చాలా ఉదృతంగా ప్రవహిస్తుంది శ్రీ అమ్మవారి ఆలయ పరిసర ప్రాంతాలు అన్నీ కూడా బురదతో నిండి ఉన్నవి కావున భక్తులకు శ్రీ అమ్మవారి దర్శనములను తాత్కాలికముగా నిలుపుదల చేయడమైనది తిరిగి మేము భక్తులను శ్రీ అమ్మవారి దర్శనమునకు అనుమతించు తేది ప్రకటించు వరకు ఎవ్వరూ కూడా శ్రీ అమ్మవారి ఆలయం నకు రావద్దు అని మా మనవి గోదావరి నది అతి వేగంగా ప్రవహిస్తున్నది గోదావరి నది దగ్గరకు వెళ్ళుట అతి ప్రమాదకరం ఫోటోలకు గానీ సెల్ఫీలకు గానీ మరి ఏ ఇతర పనులకు గానీ గోదావరి నది ఒడ్డులకు గానీ గోదావరి నది దరిదాపులకు గానీ వెళ్ళరాదు కార్యనిర్వహణాధికారి ఎం.శ్రీనివాస రెడ్డి ఛైర్మన్ & ధర్మకర్తల మండలి శ్రీ గండి పోశమ్మ అమ్మవారి దేవస్థానం గొందూరు గ్రామం దేవీపట్నం మండలం పోలవరం జిల్లా