పయనిoచే సూర్యుడు ఆదోని 18 జనవరి కర్నూలు జిల్లా క్రైమ్ రిపోర్టర్ ఎరుకల మహేష్ నూతనంగా ఎన్నికైన కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బోయ క్రాంతినాయుడు ఈరోజు ఆదోని డివిజన్ నియోజకవర్గాల పర్యటన చేపట్టడం జరిగింది. ఆదోని నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా అధ్యక్షుల పర్యటనను ఆదోనిలో ఘనంగా ఆహ్వానం పలికారు. కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ఉపాధ్యక్షులు, ఆదోని మున్సిపల్ మాజీ కౌన్సిలర్ దిలీప్ దోక గారి ఆధ్వర్యంలో రోడ్డు భావనల అతిథి గృహంలో పార్టీ కార్యకర్తల పరిచయ వేదిక సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. పట్టణ అధ్యక్షులు వై సాయినాథ్ అధ్యక్షతన ఆదోని కాంగ్రెస్ పార్టీ నాయకుల పరిచయం చేయడం జరిగింది అనంతరం పార్టీ కార్యకర్తల అభిప్రాయ సేకరణ పార్టీ బలోపేతానికి భవిష్యత్ కార్యాచరణపై పలు అంశాలు చర్చించడం జరిగింది. అనంతరం జిల్లా అధ్యక్షులు క్రాంతి నాయుడు మాట్లాడుతూ త్వరలో నియోజకవర్గ ఇంచార్జీలను నియమిస్తమనారు. ప్రతి కాంగ్రెస్ కార్యకర్త పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు అలాగే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని అందుకు ముందస్తుగానే ప్రణాళికలు వేసుకోవాలని చెప్పడం జరిగింది. ప్రతి నెల నియోజకవర్గ స్థాయి కార్యకర్తలతో స్థానిక సమస్యలపై పోరాడుతానని కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని హామీ ఇవ్వడం జరిగింది. ఆదోని జిల్లా సాధనకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని పత్రిక ముఖంగా తెలపడం జరిగింది. అలాగే ఆదోని జిల్లా అంశంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కలుస్తామని చెప్పారు అలాగే ఈ నెల 21న కర్నూలు కాంగ్రెస్ పార్టీ ఆఫీసు కళవేంకట్రవు భవనం నందు జరగబోవు జిల్లా అధ్యక్షుల పదవి బాధ్యత స్వీకరణోత్సవ కార్యక్రమానికి అందరూ పాల్గొనాలను ఆహ్వానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి రావు, రాష్ట్ర మైనారిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ నూర్ అహ్మద్, ఆదోని యువజన అధ్యక్షులు దేవిశెట్టి వీరేష్, జాతీయ విద్యార్తి సంఘం రాష్ట్ర నాయకులు శ్రీనిత్ రాయల్, పార్టీ సీనియర్ నాయకులు రామకృష్ణ రెడ్డి, దేవిశెట్టి ప్రకాష్, ఆదోని మండల అధ్యక్షుడు మోహన్ రెడ్డి, మాణిక్యరాజు, రామన్న యాదవ్, నిసార్ అహ్మద్, ఫరూక్ అహ్మద్, రఫిక్ అహ్మద్, ఏజాజ్ భాష, తాయన్న, అయ్యప్ప, హనుమంతు, కాడిబోడి ఫరూఖ్, మద్దిలేటి, డాకప్ప తదితరులు పాల్గొన్నారు.