పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 18.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) క్రికెట్ ఆడుతూ యువకుడు మృతి చెందిన సంఘటన శనివారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది మండలంలోని వెంగళపల్లి పంచాయతీ పెద్దూరుకు చెందిన సహదేవ రెడ్డి కుమారుడు తేజ 22 గ్రామానికి సమీపంలోని పాలెంపల్లి వద్ద క్రికెట్ టోర్నమెంట్ కు వెళ్ళాడు అక్కడ ఫీల్డింగ్ చేస్తూ ఒక్కసారిగా కుప్పకూలాడు సహచరులు వెంటనే అతన్ని చౌడేపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక్కడ అతని ఆరోగ్య పరిస్థితి విషమించడంతో పుంగనూరుకు సిఫారసు చేశారు మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు