గిరిజన గ్రామాల్లో చలి దుప్పట్లు వితరణ..

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గం మందస మండలం భావనాపురం గ్రామంలో గ్రీన్ ఆర్మీ ఆధ్వర్యంలో చలి దుప్పట్లు, బిస్కెట్లు మిఠాయిలు పంపిణీ చేసి గ్రామస్తులతో ముచ్చటించడం జరిగింది.ఈ సందర్భంగా ఏపీఎన్జీవోస్ మరియు గ్రీన్ ఆర్మీ అధ్యక్షులు బోనేల గోపాల్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రకృతికి దగ్గరగా ఉండే వ్యక్తులతో కలిసి,వారి యొక్క యోగ క్షేమాలు కనుక్కొని వారి యొక్క అవసరాలు తీర్చలేము గాని గడిపే సమయం ఆనందాన్నిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ ఉత్తమ ఉపాధ్యాయులు ఆస్పాన మధుబాబు పిఆర్ డిపార్ట్మెంట్ కొంచాడ సాయి వెంకట శివ ప్రసాద్, ఉపాధ్యాయులు దాసరిశ్రీనివాసరావు గ్రీన్ ఆర్మీ సభ్యులు హుస్సేన్ గిరిజన సంఘ నాయకులు సవర ధర్మారావు తదితరులు పాల్గొన్నారు