పయనించే సూర్యుడు మేజర్ న్యూస్ జనవరి 18.01.2026 మదనపల్లె అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లి మండల ప్రతినిధి జె. నాగరాజ) గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది ఎస్సై నాగేశ్వరరావు కథ మేరకు చౌడేపల్లి తిరుపతి ప్రధాన రహదారి సింగిరిగుంట బస్సు స్టేజికి కొంత దూరంలో గుర్తుతెలియని వ్యక్తి రోడ్డు ప్రమాదంలో గాయపడిన సమాచారం అందింది వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని గుర్తుతెలియని వ్యక్తిని అదేవిధంగా గుర్తుతెలియని వాహనం ఢీకొన్న ట్లుగా తెలుసుకొని గాయపడ్డ వ్యక్తిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు గాయపడ్డ వ్యక్తి యొక్క ఫోటో సోషల్ మీడియాలో హల్చల్ కావడంతో సదరు వ్యక్తి చౌడేపల్లి మండలం పంచాయతీ కేంద్రం పరికిదొన కొమ్ము శ్రీనివాసులు 52 గా గుర్తించారు గాయపడ్డ వ్యక్తి మరణించడంతో మృతుని భార్య ఓబులమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి అక్కడే మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వివరించారు