పయనించే సూర్యుడు 18-1-2026 గొల్లపల్లి మండల రిపోర్టర్ (ఆవుల చందు) జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో విద్యుత్ సమస్యలు క్షేత్ర స్థాయిలో పరిష్కారం కొరకు ప్రజా బాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లైఫ్ ఇన్స్పెక్టర్ లైన్మెన్ గంగ రామ్ నాయక్ మాట్లాడుతూ అంబేద్కర్ చౌరస్తా పరిధిలో విద్యుత్తు స్తంభాలు వేయడం జరిగింది మండలంలో విద్యుత్తుపై అనేక మంది సమస్యలు తలెత్తి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాటిని పరిష్కరించేందుకు విద్యుత్తు శాఖ “ప్రజా బాట” అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు కొన్ని సమస్యలు వివరించగా వాటిని పై అధికారుల దృష్టికి తీసుకెళ్లి తొందరగా పరిష్కరిస్తామని అన్నారు. విద్యుత్తుకు సంబంధించిన సమస్యలు ఉంటే మా విద్యుత్ శాఖ అధికారుల దృష్టికి తీసుకువస్తే వెంటనే మా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఎలక్ట్రికల్ యాక్సిడెంట్లు జరుగుతున్నందున వాటిని నివారించేందుకు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అన్నారు. ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి అనేది వినియోగదారులకు పలు సూచనలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లైన్ ఇన్స్పెక్టర్ దుబ్బ రాజం ఏఎల్ఎం అనిల్ విద్యుత్ శాఖ సిబ్బంది సిరికొండ చంద్రశేఖర్ రైతులు తదితరులు పాల్గొన్నారు