గోపాలమిత్ర పశు వైద్య శిబిరాన్ని ప్రారంభించిన సర్పంచ్ పెరిక. నాగేశ్వర రావు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 18, తల్లాడ రిపోర్టర్ తల్లాడ గ్రామ పంచాయితీ నారాయణపురం గ్రామం లో గోపాలమిత్ర పశు వైద్య శిబిరాన్ని తల్లాడ సర్పంచ్ పెరిక.నాగేశ్వర రావు ప్రారంభించారు. ఈ సంధర్బంగా మండల వైద్య అధికారి డాక్టర్ ఎండి అనస్ ఆధ్వర్యంలో సూడు కట్టని ఎదుకు రాని గర్భ కోసం వ్యాధులు ఉన్న పశువులకి చికిత్స చేసి మందులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో తల్లాడ ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, గోపాలమిత్రులు ఐ పవన్, జి రమేష్, పశువైద్య సిబ్బంది టి.నాగరాజు, డి. చో క్కరావు,యన్. ఏడుకొండలు గోపాలమిత్ర సూపర్వైజర్ శివకృష్ణ పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *