
పయనించే సూర్యడు / జనవరి 18/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు తెలంగాణ రాజ్యాధికార పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలను టీఆర్పీ మేడ్చల్ జిల్లా యువజన అధ్యక్షుడు సింగం ఆరుణ్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో నిర్వహించగా, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని, రాష్ట్రానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు. అనంతరం బాణాసంచా కాల్చి, కేక్ కట్ చేసి, పార్టీ నాయకులతో కలిసి నినాదాలు చేస్తూ జన్మదిన వేడుకలను ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా ఆరుణ్ కుమార్ పటేల్ మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం తీన్మార్ మల్లన్న జన్మదినాన్ని పురస్కరించుకుని రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఇతర సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఎల్లవేళలా ప్రజల సేవకే అంకితమై ఉందని, ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల అభ్యున్నతి కోసం తీన్మార్ మల్లన్న నిరంతరం కృషి చేస్తున్నారని పేర్కొన్నారు.