
యనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 బోధన్ పట్టణంలోని చెక్కి కాంప్ శివారులో శనివారం కారు ఆటో ఢీకొన్నాయి పెంట ఖుర్దు నుంచి బోధన్ కు వస్తున్న కారు ఎదురుగా వేగంగా వస్తున్న ఆటోను తప్పించబోయి కారు రోడ్డు కిందకు దూసుకు వెళ్లి స్తంభాన్ని ఢీకొట్టింది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో కారులోని వారు సురక్షితంగా బయటపడ్డారు ప్రమాదంలో కారు ముందు భాగం దెబ్బతింది బోధన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.