పయనించే సూర్యుడు జనవరి 18 ఆదోని నియోజకవర్గం క్రైమ్ రిపోర్టర్ కృష్ణ ఆదోని జిల్లా సాధన కోసం జరిగే కార్యక్రమాలలో బిజెపి పార్టీ ఎప్పుడూ ముందుంటుందని, కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతమైన ఆదోని రెవెన్యూ డివిజన్ అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలంటే, ఆదోని జిల్లా యే ఏకైక మార్గం అని బీజెవైయం నాయకులు అన్నారు, ఆదోని జిల్లా సాధన కోసం గత 63 రోజులుగా జరుగుతున్న నిరాహార దీక్షలో మద్దతుగా శనివారం ఆదోని భారతీయ జనతా పార్టీ యువమోర్చా నాయకులు దీక్షలో కూర్చోవడం జరిగింది. దీక్షలో కూర్చున్న నాయకులు అంజయ్, రవి శంకర్, నరసింహులు, శివరాజు, నాగరాజు, ఈశ్వర్, రంగస్వామి, కాశీ విశ్వనాథ్, నరసింహులు, గోపాల్, హుసేని, నరేంద్ర, జయ కృష్ణ, సాయి, భీమేష్, ఈరన్న, రాము, జాఫర్.
