తెలుగు లోగిళ్లలో సంక్రాంతి వేడుకలు ఆనందానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీకలు టిడిపి నేత చింతల

పయనించే సూర్యుడు పెనుగంచిప్రోలు మండలం రిపోర్టర్ ఆరుద్ర రమేష్ ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 18 పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజు న , మకర రాశిలోనికి సూర్యభగవానుడి ప్రవేశంతో ప్రారంభమయ్యే ఉత్తరాయణ పుణ్యకాల పవిత్ర పర్వదినం మకర సంక్రాంతి. తెలుగుదనాన్ని లోకమంతా చాటుతూ మన సంప్రదాయాన్ని విశ్వమంతా తెలుపుతూ సంబరాల సంక్రాంతి పండుగను భోగి, సంక్రాంతి, కనుమ, మూడు రోజులు ఘనంగా జరుపుకోవాలి. అన్ని పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హరిదాసు కీర్తనలు, బసవన్న దీవెనలు, ఇల్లాలి ముగ్గులు, పిండి వంటల ఘుమ ఘుమలు, ఇదే కదా మన సంక్రాంతి పండుగ సంబరాలు.. సంక్రాంతి పండుగ మీ జీవితాలలో నూతన కాంతులను నింపాలి. ప్రతి కుటుంబంలో ఆనందోత్సవాలు వెల్లివిరియాలి. పాడి పంటలతో, పచ్చని పైర్లతో పల్లెలు కళకళలాడాలి. ప్రజలంతా సుఖసంతోషాలతో, సిరిసంపదలతో తలతూగాలని, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షిస్తూ.. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు లను పెనుగంచిప్రోలు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతల సీతారామయ్య మండల ప్రజల కు తెలిపారు