
పయనించే సూర్యుడు జనవరి 18 భీమదేవరపల్లి:- హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ శ్రీ వీరభద్ర స్వామి బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.. ఈ సందర్భంగా శనివారం భద్రకాళి సమేత వీరభద్ర స్వామి త్రిశూల స్నాన ఘట్టం, భక్త జనుల మధ్య వైభవంగా జరిగింది.. అనంతరం మహాశివరాత్రి పురస్కరించుకొని విశేషంగా రుద్ర సహిత చండీ హవనం నిర్వహించి, స్వామివారికి మహా పూర్ణహుతి కలశ ఉద్వాసన, కుంబాభిషేకం నిర్వహించారు.. స్వామి వారి మాట వీధుల్లో అష్ట భైరవార్చిన, బలిహరణ నిర్వహించి, స్వామివారి ఖడ్గాలు శూలాలతో పవిత్ర కోనేరుకు చేరుకొని, పుష్కరార్చన గావించి ఋషుల స్నాన ఘట్టం పూర్తి చేశారు.. అనంతరం శాస్త్రం అవసరం వల్ల శరీర రుగ్మతలు దొరుకుతాయని పగాఢ నమ్మకంతో భక్తులు స్వామివారినీ దర్శించుకున్నారు.. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కిషన్ రావు, దేవాలయ కమిటీ చైర్మన్ అశోక్ ముఖర్జీ, ఆలయ సిబ్బంది, అర్చకులు, ప్రజా ప్రతినిధులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.