పయనించే సూర్యుడు, జనవరి 18 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) దోమల నివారణకు సొంత నిధులతో వాహనాలు సమకూర్చడం అభినందనీ యమని బి ఆర్ ఎస్ పార్టీ అభినందని యం అని బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. శేరిలింగంప ల్లి నియోజకవర్గం లోని శేరిలింగంపల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ నాయకులు పొట్ట నరేందర్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దోమల నివారణ వాహనాలను తెలంగాణ భవన్ లో కేటీఆర్ పరిశీలించారు. .ప్రభుత్వం, జిహెచ్ఎంసి అధికారులు దోమల నివారణ చర్యలు చేపట్టడం లో విఫలం కావడంతో స్వంత ఖర్చు లతో దోమల నివారణ వాహనాలను కొనుగోలు చేసినట్లు నరేందర్ యాదవ్. తెలిపారు. ప్రజలకు సేవ చేయడం అభినందనీయ మని పొట్ట నరేందర్ యాదవ్ దోమల నివారణ కోసం తీసుకున్న చర్యలను అభినందించించారు.