పయనించే సూర్యుడు జనవరి 18 బచ్చలపేట మండల ప్రతినిధి: నీల పవన్. జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ చైర్మన్ ప్రతిమ మరియు సెక్రెటరీ సుచరిత ఆదేశాలతో శనివారం రోజు బచ్చన్నపేట మండలం, పోచన్నపేట గ్రామంలో హై స్కూల్లో న్యాయవిజ్ఞాన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు హరిశంకర్ చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ మంచాల రవీందర్, సత్తయ్య దయామని లావణ్య అపర్ణ పి ఎల్ వి సుందరయ్య యాదగిరి గ్రామ ఉపసర్పంచ్ జంధ్యాల ఉమేష్ చంద్ర, శ్రీనివాసులు గోవర్ధన్ అధ్యాపక బృందం పిల్లలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చీఫ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది మంచాల రవీందర్ మాట్లాడుతూ పిల్లలకు బాల్య వివాహ మముక్తభారత్, చట్టాల గురించి పోక్సో, 15100 సుప్రీంకోర్టు టోల్ ఫ్రీ నెంబర్, గురించి మరియు అనేక చట్టాలపై అవగాహన కల్పించారు. గ్రామాలలో యువత ఆన్లైన్లో బెట్టింగులు తదితర అంశాలలో మోసాలకు గురి అవుతున్నారని అట్టి విషయంలో మోసపోకుండా తగు జాగ్రత్తలపై అప్రమత్తత ఉండాలని యువతకు పిలుపునిచ్చారు. జిల్లా 6న్యాయసభ అధికార సంస్థలు సంప్రదించి న్యాయ సహాయం పొందాలని సూచించారు.