పయనించే సూర్యుడు, జనవరి 18, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్ నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు తాను ఎల్లప్పుడూ అండగా ఉంటానని జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి భరోసా ఇచ్చారు. శనివారం బచ్చన్నపేట మండలంలోని వివిధ గ్రామాల్లో పర్యటించిన ఆయన, ఇటీవల మృతి చెందిన పలువురు పార్టీ కార్యకర్తలు వారి కుటుంబాలను పరామర్శించారు. సాల్వాపూర్, పడమటికేశ్వాపూర్ సహా పలు గ్రామాల బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ. 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన చీర్ల వెంకటేశ్ కుటుంబ సభ్యులను, ఇతర మృతుల కుటుంబాలను కలిసి ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇర్రి రమణారెడ్డి, ఫిరోజ్, గంగం సతీష్ రెడ్డి, దూడల కనుకయ్య గౌడ్, చల్లా శ్రీనివాస్ రెడ్డి మరియు ఇతర స్థానిక నాయకులు పాల్గొన్నారు.