బిఆర్ఎస్ ఆధ్వర్యంలో ఘనంగా ముగ్గుల పోటీలు

పయనించే సూర్యుడు, 18 జనవరి 2026, భీంగల్ మండల్ ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి , నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం భీంగల్ పట్టణంలోని నాలుగో వార్డులో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని బీఆర్‌ఎస్ నాయకుడు, మాజీ వైస్ చైర్మన్ బాల భగత్ ఆధ్వర్యంలో సంక్రాంతి ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు.ఈ పోటీలలో వార్డుకు చెందిన మహిళలు, చిన్నారులు అధిక సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ముగ్గుల పోటీలు వార్డులో పండుగ వాతావరణాన్ని మరింత శోభాయమానంగా మార్చాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన గాడి శోభ మరియు బెజ్జోరా మాజీ సర్పంచ్ సుమన్ విజేతలకు బహుమతులు అందజేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఇటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు సంప్రదాయాలను కాపాడటంతో పాటు మహిళలు, పిల్లల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికి తీస్తాయని పేర్కొన్నారు.ఇట్టి కార్యక్రమంలో గొల్లపల్లి సురేష్, కొండూరు గంగాధర్, మందుల చంటి, దుర్గ ప్రసాద్, సున్నం భాస్కర్, ఎర్రోళ్ల ప్రవీణ్, నాలుగో వార్డు బీఆర్‌ఎస్ కార్యకర్తలు, వార్డు ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.