బిజినపల్లి మండల కేంద్రంలో సీఎం కప్ టోర్నమెంట్ టార్చ్ ర్యాలీ

పయనించే సూర్యుడు జనవరి 18 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బిజినపల్లి మండల కేంద్రంలో ఈ రోజు సీఎం కప్ టోర్నమెంట్ సందర్భంగా టార్చ్ ర్యాలీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీడీవో కథలప్ప ఎంఈఓ రఘునందన్ జెడ్‌పీహెచ్‌ఎస్ బాయ్స్ హెచ్‌ఎం కృష్ణయ్య పాల్గొన్నారు. అదేవిధంగా పోలీస్ శాఖ తరఫున ఎస్‌ఐ శ్రీనివాసులు పీడీ నిరంజన్ యాదవ్ వివిధ గ్రామాల నుండి వచ్చిన పీడీలు, గ్రామ డెప్యూటీ సర్పంచ్, వివిధ పాఠశాలల విద్యార్థులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు. ఈ టార్చ్ ర్యాలీ ద్వారా సీఎం కప్ టోర్నమెంట్‌పై ప్రజల్లో అవగాహన కల్పించడంతో పాటు క్రీడల ప్రాముఖ్యతను వివరించారు.