పయనించే సూర్యుడు, జనవరి 18 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి (ఎస్ఎంకుమార్) ప్రజలకు సురక్షితమైన, పరిశుభ్రమైన పోలీస్ స్టేషన్ వాతావరణాన్ని కల్పించా లనే లక్ష్యంతో సైబరాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్‌లలోని సిబ్బంది స్వచ్ఛం దంగా ఈరోజు పచ్చదనం – పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్‌లలోని వాహనాలు, కోర్టు కేసులకు సంబంధిం చిన పాత వాహనాలు, అబాండెడ్ వాహనాలను సమగ్రంగా గుర్తించి వాటిని వేరు చేసి ప్రత్యేకంగా కేటాయించిన స్థలాల్లో క్రమబద్ధంగా నిలిపారు. అలాగే రికార్డుల నిర్వహణ సక్రమంగా ఉండేలా తగిన చర్యలు తీసుకున్నారు.పోలీస్ స్టేషన్‌లతో పాటు పరిసర ప్రాంతాలు శుభ్రం చేసి పరిశు భ్రతపై ప్రత్యేక దృష్టి సారించారు.పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు.
