
పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 18, తల్లాడ రిపోర్టర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరావును శుక్రవారం తల్లాడ మండల కాంగ్రెస్ నాయకులు దుండేటి వీరారెడ్డి ఆధ్వర్యంలో మంత్రి స్వగ్రామం గండుగులపల్లిలోని వ్యవసాయ క్షేత్రం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పుష్పగుచ్చం అందించి సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరావు తల్లాడ మండల నాయకులను పేరుపేరునా పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గంగదేవి పాడు సొసైటీ చైర్మన్ తూము వీరభద్రం, దుండేటి వీరారెడ్డి, బీరెడ్డి ముత్తారెడ్డి, మారెళ్ళ మల్లికార్జున రావు, పగడాల లచ్చిరెడ్డి, పగిడిపల్లి రవి, ఎల్లంకి వెంకటేశ్వర్లు తాళ్ల జోసెఫ్, కోడూరు రాము, కొడవటిమెట్ట సర్పంచ్ మోదుగు తిరుమల్ రావు, గొల్లమందల దేవా, అమర్లపూడి అమృత రావు, బాబు, తదితరులు పాల్గొన్నారు.