పయనించే సూర్యడు/ జనవరి 18/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు మల్లాపూర్ డివిజన్ పరిధిలో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను తక్షణమే పూర్తిచేయాలని గ్రేటర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు నెమలి అనిల్ కుమార్ డిమాండ్ చేశారు.‘బస్తీ బాట’ కార్యక్రమంలో భాగంగా ఓల్డ్ మల్లాపూర్ ప్రాంతంలో జలమండలి శాఖ ఏఈ సిరాజ్, విద్యుత్ శాఖ ఏఈ విజయ్‌లతో కలిసి ఆయన పలు బస్తీలు, కాలనీలు పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులు ఎదుర్కొంటున్న తాగునీరు, విద్యుత్‌కు సంబంధించిన సమస్యలను పరిశీలించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. గత కొద్ది రోజులుగా పెండింగ్‌లో ఉన్న పనుల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొంటూ, వాటిని వెంటనే పరిష్కరించాలని అధికారులను కోరారు. దీనికి స్పందించిన జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జలమండలి, విద్యుత్ శాఖ అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.