రంగుల మండపంలో నిరంతర పర్యవేక్షణ సేవా కార్యక్రమాలలో ఉత్సవ కమిటీ సభ్యులు

★ దీక్ష స్వాములకు అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న ఉత్సవ కమిటీ సభ్యులు కల్లూరి శ్రీవాణి, పాకాలపాటి అనసూర్య

పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 18 జగ్గయ్యపేట పట్టణంలోని రంగుల మండపంలో వేంచేసి ఉన్న శ్రీ గోపయ్య సమేత లక్ష్మీ తిరుపతమ్మ తల్లి రంగుల మహోత్సవ కార్యక్రమాన్ని శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య ఆదేశాలతో, ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు సూచనలతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలక్కుండా , అన్ని శాఖలను సమన్వయం చేసేలా ఉత్సవ కమిటీ సభ్యులు కల్లూరి శ్రీవాణి, పాకాలపాటి అనసూర్య శనివారం నాడు నిరంతర పర్యవేక్షణ చేస్తున్నారు. ఆలయ ఉత్సవ కమిటీ చైర్మన్ చుంచు రమేష్ బాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ పి వెంకటేశ్వర్లు ప్రతిరోజు అమ్మవారిని దర్శించుకొని కమిటీ సభ్యులకు అవసరమైన సలహాలు సూచనలు తెలియజేస్తున్నారు. రంగుల మహోత్సవాన్ని విజయవంతం చేయడానికి పోలీస్, రెవిన్యూ శాఖలు నుండి ప్రతిరోజు ఒకరికి డ్యూటీలు కేటాయిస్తున్నారు. మండప పరిసరాల ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచడానికి భక్తులకు అవసరమైన త్రాగునీరు అందించడానికి మున్సిపల్ శాఖ అవసరమైన చర్యలు తీసుకుంటుంది. దీక్ష స్వాములకు అన్నదాన కార్యక్రమం లో పాల్గొన్న ఉత్సవ కమిటీ సభ్యులు కల్లూరి శ్రీవాణి, పాకాలపాటి అనసూర్య రంగుల మండపం వద్ద దాతల సహాయంతో దీక్షా స్వాములు ఏర్పాటు చేసిన అన్నదాన పాల్గొన్న ఉత్సవ కమిటీ సభ్యులు కల్లూరి శ్రీవాణి, పాకాలపాటి అనసూర్య దీక్షా స్వాములకు అన్నప్రసాదం వడ్డించి దీక్షా స్వాములు చేస్తున్న అన్నదానం గురించి గొప్పగా కొనియాడుతూ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమాలలో రాష్ట్ర అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలు ఆచంట సునీత, నాయకులు కాకులపాటి కృష్ణమోహన్ , అమ్మవారి సేవకులు పాల్గొన్నారు.