పయనించే సూర్యుడు న్యూస్ :జనవరి /18: నియోజకవర్గం స్టాప్ రిపోర్టార్ :సాయిరెడ్డి బొల్లం :రాజన్న సిరిసిల్ల జిల్లా మానకొండూర్ నియోజకవర్గం ఇల్లంతకుంట మండలం జంగారెడ్డిపల్లి గ్రామంలోని శ్రీ రామలింగేశ్వరస్వామి జాతరలో భాగంగా శనివారం నిర్వహించిన రథోత్సవంలో మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు ఆలయ పూజారులు, ధర్మకర్తలు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ఆశీర్వచనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, మాజీ ఎంపీపీ గుడిసె అయిలయ్య, పార్టీ నాయకులు పసుల వెంకటి, ఒగ్గు రమేశ్, మంజుల-రమేశ్, రాజు, బాల్ రెడ్డి, రవీందర్ రెడ్డి, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
