పయనించేసూర్యుడు, జనవరి18, రామగుండం మండలం (విద్యాసాగర్): తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా శనివారం హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నాయకత్వం కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమరపు లావణ్య అరుణకుమార్ పాల్గొన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు, తెలంగాణ ప్రభారి అభయ్ పాటిల్ తో పాటు పలువురు రాష్ట్ర స్థాయి నాయకులను కలిసిన సోమరపు లావణ్య అరుణకుమార్, రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా పూర్తి స్థాయిలో పనిచేయాలని స్పష్టం చేశారు.