పయనించేసూర్యుడు, జనవరి 18 రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని 60 డివిజన్లో ఎన్సిపి అభ్యర్థులను పోటీ నిలబెడతామని అత్యధిక స్థానాల్లో అభ్యర్థులను గెలిపించుకొని రామగుండం కార్పొరేషన్ ఎన్ సి పి జెండా ఎగరవేస్తామని ఎన్సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేకల శ్రీధర్ యాదవ్ అన్నారు. శ్రీధర్ మాట్లాడుతూ తెలంగాణలో ఎక్కడలేని విధంగా రామగుండం మున్సిపల్ కార్పొరేషన్కు ఎన్టీపీసీ సింగరేణి ఆర్ఎఫ్సిఎల్ కేంద్ర ప్రభుత్వ నిధులు తోపాటు తెలంగాణ రాష్ట్ర నిధులు వస్తున్న పాలకులు అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యం గా వ్యవహరించడం కాకుండా రామగుండం కార్పొరేషన్ వస్తున్న నిధులను రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో కాకుండా తెలంగాణ రాష్ట్రమంతా ఖర్చు చేయడంతోనే రామగుండం అభివృద్ధికి నోచుకోలేదన్నారు. అందుకే రానున్న ఈ మున్సిపల్ కార్పొరేషన్ లో ఎన్సీపీ అభ్యర్థులను 60 డివిజన్లో పోటీ చేయించి ప్రజల ఆశీర్వాదంతో ఎన్సిపి అత్యధిక మెజార్టీతో గెలుపొందితే రామగుండం తెలంగాణలోని ప్రథమ కార్పొరేషన్ తీర్చిదిద్దామని ఆయన అన్నారు.