రాష్ట్రస్థాయి ఖో ఖో పోటీలకు వి హాసిని విద్యార్థిని ఎంపిక

పయనించే సూర్యుడు జనవరి 18 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట లో జరిగే ఖో ఖో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు సబ్ జూనియర్ బాలికల ఖో ఖో పోటీలకు వి హాసిని ఎంపికయ్యారు. జడ్పీహెచ్ఎస్ కొత్తపల్లి విద్యార్థిని వి హాసిని ఎంపికైనట్లు పిడి మేడం రేణుక తెలిపారు. జడ్.పి.హెచ్.ఎస్ కొత్తపల్లి పాఠశాల విద్యార్థిని ఎంపికవడం పట్ల పాఠశాల ప్రధానోపాధ్యాయులు జరీనా అంజుమ్ అభినందించారు. మహబూబ్ నగర్ జిల్లాలో నారాయణపేట లో జరిగే 18 నుండి 20 వరకు రాష్ట్రస్థాయిలో పాల్గొంటారు. పాఠశాల ఉపాధ్యాయ బృందం మరియు గ్రామ ప్రజలు అభినందించారు.