రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న బీజేపీ నాయకుడు ఎల్లంకి సుధాకర్‌ను పరామర్శించిన నాయకులు

పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 18, తల్లాడ రిపోర్టర్ అన్నారు గూడెం గ్రామానికి చెందిన భారతీయ జనతా పార్టీ నాయకుడు ఎల్లంకి సుధాకర్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ ప్రస్తుతం తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ విషయం తెలుసుకున్న నాయకులు ఈరోజు ఉదయం ఆయన నివాసానికి వెళ్లి సుధాకర్‌ను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకొని, త్వరితగతిన పూర్తిగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ధైర్యంగా ఉండాలని నాయకులు తెలిపారు. ఈ పరామర్శ కార్యక్రమంలో భాజపా నాయకులు ఆపతి వెంకట రామారావు, మాజీ తల్లాడ ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, గ్రామ సర్పంచ్ గొడ్డ ప్రభాకర్ రావు, ఉపసర్పంచ్ కొమ్మినేని వెంకటేశ్వర్లు, 12వ వార్డు సభ్యులు పొన్నం కృష్ణయ్యపద్మావతి, దొడ్డ చిన్న శ్రీనివాసరావు, మారెళ్ళ దేవేందర్ రావు, చీకటి వెంకటేశ్వర్లు, గొర్ల మోహన్ రెడ్డి, పెరసాని నరసింహారావు, చీకటి నాగేశ్వరరావు, బండి శ్రీను, కందుల నారాయణ తదితరులు పాల్గొన్నారు.