లాటరీ పద్ధతి ద్వారా మహిళా రిజర్వేషన్ వార్డులు ఖరారు

★ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి

పయనించే సూర్యుడు జనవరి 18 కరీంనగర్ న్యూస్ : కరీంనగర్ లో లాటరీ పద్దతి ద్వారా జిల్లాలోని 3 మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్ కు మహిళా రిజర్వేషన్ వార్డులు ఖరారు చేసినట్లు జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి తెలిపారు ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల మేరకు మున్సిపల్ వార్డులలో మహిళ రిజర్వేషన్ ఖరారు చేసే ప్రక్రియను శనివారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా కలెక్టర్, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు మున్సిపల్ వార్డులలో మహిళలకు రిజర్వేషన్ కేటాయింపు ప్రక్రియ పారదర్శకంగా లాటరీ పద్ధతి ద్వారా పూర్తి చేయడం జరిగిందని అన్నారు ప్రతి మున్సిపాలిటీకి సంబంధించి వార్డుల వారీగా రిజర్వేషన్ స్థితిగతులను తెలుపుతూ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో చొప్పదండి హుజురాబాద్ జమ్మికుంట మున్సిపాలిటీలలో, కరీంనగర్ కార్పొరేషన్ లో వార్డుల వారిగా కేటాయించిన రిజర్వేషన్ వివరాలను తెలుపుతూ లాటరీ పద్ధతి ద్వారా ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ వారీగా మహిళలకు కేటాయించే వార్డులను లాటరీ పద్ధతిలో ఎంపిక చేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే మున్సిపల్ కమిషనర్ ప్రపోల్ దేశాయ్ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గోన్నారు