వెంకటేశ్వరస్వామి 44వ బ్రహ్మోత్సవాలు

పయనించే సూర్యుడు జనవరి 18 హుజురాబాద్ రూరల్ రిపోర్టర్ బండ శివానంద రెడ్డి హుజురాబాద్ మునిసిపల్ పరిధిలోని కేసి క్యాంప్ లోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి 44వ బ్రహ్మోత్సవములు 18వ తేదీ ఆదివారము నుండి ఈ నెల 22 తేదీ గురువారం వరకు నిర్వహిస్తున్నట్లు ప్రధాన అర్చకులు కొదమగుళ్ల నందకిషోర్ ఆచార్యులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.18 జనవరి 2026 ఆదివారం రోజున సాయంత్రం 6 గంటలకు బ్రహ్మోత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. 19 జనవరి2026 సోమవారం రోజున అగ్ని ప్రతిష్ట, ద్వజారోహణము, దేవత ఆహ్వానము కార్యక్రమం ఉంటాయి. 20 జనవరి 2026 మంగళవారం రోజున నిత్య హోమం, బలిహారము కళ్యాణోత్సవం (అన్న ప్రసాదం వితరణ) 21 జనవరి 2026 బుధవారం రోజున సాయంత్రం 7 గంటలకు నిత్య హోమం, బలిహారము, సహస్ర దీపాలంకరణ. 22 జనవరి 2026 గురువారం రోజున పూర్ణాహుతి. పుష్పయాగం, ద్వాదశరాధన, ఆశీర్వాదం కార్యక్రమంలో ఉంటాయి. బ్రహ్మోత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు ఈ సందర్భంగా కోరారు. భక్తులు మరింత అదనపు సమాచారము కొరకు సెల్ నెంబర్ ల ద్వారా సంప్రదించవచ్చు. కమిటీ సభ్యులు 9121994006, 9948940886, 9989766710లలో సంప్రదించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *