పయనించే సూర్యుడు-రాజంపేట న్యూస్ జనవరి 18 : పట్టణంలోని మన్నూరులో నూతనంగా నిర్మితమవుతున్న శ్రీ గోదామహాలక్ష్మి సమేత ఐరావత ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానములు హిందూ ధర్మ ప్రచార పరిషత్ ధర్మాచార్యులు గంగనపల్లి వెంకటరమణ, హైమావతి దంపతులు శనివారం విరాళం అందజేశారు. మన్నూరు గ్రామస్తులతో పాటు పలువురు దాతల సహకారంతో నిర్మితమవుతున్న ఈ ఆలయ నిర్మాణానికి తమ వంతుగా రూ 51516 వేలు విరాళాన్ని ఆలయ కమిటీ ప్రతినిధులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ ప్రతినిధులు తుంగా గోపాల్ రెడ్డి, లావనూరు సుబ్బరాయుడు, బైరిశెట్టి కొండయ్య, నారదాసు మధు, నారా మణి, దొంతెం శంకరయ్య, అనుములగుండం లక్ష్మయ్య, మల్లెల చిన్న నరసింహులు, సుబ్బలక్ష్మమ్మ, గంగనపల్లి జగతి, జాగృతీలు పాల్గొన్నారు.