వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 యడ్లపాడు మండల ప్రతినిధి.. చిలకలూరి పేటలోని మాజీ మంత్రి విడదల రజిని నివాసం సమీపంలో అనగా 18/01/2026 (ఆదివారం) ఉదయం 10 గంటలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు ఎడ్లపాడు మండల వైఎస్ఆర్‌సీపీ అధ్యక్షులు వడ్డేపల్లి నరసింహారావు తెలిపారు. ఈ సమావేశానికి అన్ని గ్రామాల పార్టీ అధ్యక్షులు, జిల్లా మరియు నియోజకవర్గ స్థాయిలో వివిధ హోదాల్లో ఉన్న నాయకులు, రెండు గ్రామాలకు మరియు నాలుగు గ్రామాలకు నియమితులైన అబ్జర్వర్లు, అలాగే అన్ని గ్రామాల ముఖ్య నాయకులు మరియు మండల అధ్యక్షులు హాజరుకానున్నారు. పార్టీ బలోపేతం, రానున్న కార్యక్రమాలు, క్షేత్రస్థాయి రాజకీయ పరిస్థితులపై సమగ్రంగా చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కావున ఆహ్వానితులైన నాయకులు అందరూ ఈ సమావేశాన్ని గమనించి కచ్చితంగా హాజరై విజయవంతం చేయవలసిందిగా వడ్డేపల్లి నరసింహారావు కోరారు..