శ్రీ రంగపట్నం సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో పాల్గొన్న కంబాల శ్రీనివాసరావు

★ ఈ కార్యక్రమానికి కంబాల రెండు లక్షలు రూపాయలు విరాళం

పయనించే సూర్యడు ప్రతినిధి సాగర్ జనవరి. 18. 2026 తూర్పుగోదావరి జిల్లా రాజానగరం నియోజకవర్గం కోరుకొండ మండలం శ్రీ రంగపట్నం గ్రామంలో రామాలయం కమిటీ గౌరీ ఉత్సవ కమిటీ నాలుగవ తేదీన సంఘం మరియు గ్యాంగ్ స్టార్స్ ఆధ్వర్యంలో శుక్రవారం రాత్రి జరిగిన సంక్రాంతి సంబరాలు కార్యక్రమంలో విశ్వహిందూ ధర్మపరిరక్షణ రామసేన అధ్యక్షులు బీజేపీ నాయకులు కంబాల శ్రీనివాసరావు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు తొలిత ఆయనకు గ్రామస్తులు యువతి యువకులు మహిళలు స్వాగతం తెలిపారు ఘనంగా పూలమాలతో సత్కరించారు మోదకొండమ్మ అలయంలో అమ్మవారిని దర్శించుకున్నారు సంక్రాంతి సంబరాలు సందర్బంగా నిర్వహించిన క్రీడా క్రీడాకారులకు ఆటల పోటీల్లో గెలిపొందిన విజేతలకు బహుమతులు కంబాల శ్రీనివాసరావు పంపిణీ చేశారు ఈ సంక్రాంతి సంబరాలు క్రీడా పోటీలకు కంబాల శ్రీనివాసరావు రెండు లక్షల రూపాయలు విరాళం అందజేశారు.