
పయనించే సూర్యుడు జనవరి 18, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండల పరిధిలోని నాగులవంచ గ్రామంలో ఎన్ బి పి ఆధ్వర్యంలో సంక్రాంతి కనుమ పండుగ సందర్భంగా నిర్వహించిన బ్యాట్మెంటన్ (షటిల్ )పోటీలు ఉత్సాహంగా ముగిసాయి. ఈ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేశారు మొదటి బహుమతిగా 3000 రూపాయల నగదును గ్రామ సర్పంచ్ నారగాని రాంబాయి చేతుల మీదుగా షేక్ మహమ్మద్ పాషా, బంధం త్రిలై అందుకున్నారు. రెండో బహుమతిగా 2000 రూపాయల నగదు బహుమతిని మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వరరావు చేతుల మీదగా కిన్నర వెంకటరావు, కిన్నెర రానాకు అందజేశారు. మూడో బహుమతిగా 1500 రూపాయల నగదు బహుమతిని చింతకాని-2 ప్రెస్ క్లబ్ తరఫున గోనె నాగరాజు కాసాని, శేఖర్లకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రెస్ క్లబ్ ఉపాధ్యక్షులు గుండారపు రామారావు, చింతకాని-2 ప్రెస్ క్లబ్ అధ్యక్షులు జొన్నలగడ్డ మల్లేశ్వరి, వంకాయలపాటి లచ్చయ్య, ఆలస్యం బసవయ్య, ఆలస్యం రవి తదితరులు పాల్గొన్నారు.