సమ్మక్క–సారక్క గద్దె వద్ద జానపద పాట చిత్రీకరణ

* ఆహ్వానం మేరకు పాల్గొన్న ముల్కనూర్ సర్పంచ్ ప్రమోద్ రెడ్డి

పయనించే సూర్యుడు జనవరి 18 ఎన్ రజినీకాంత్ భీమదేవరపల్లి:- భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ గ్రామంలోని సమ్మక్క–సారక్క గద్దె వద్ద హుస్నాబాద్‌కు చెందిన జానపద కళాకారుల యూట్యూబ్ ఛానల్ ఆధ్వర్యంలో శనివారం సమ్మక్క–సారక్కపై ఆధారిత జానపద పాట చిత్రీకరణ జరిగింది. ఈ జానపద పాట చిత్రీకరణలో కుమారి ప్రార్థన తన తోటి కళాకారులతో కలిసి నిత్య నృత్యాలతో భక్తులను అలరించారు. గిరిజన సంప్రదాయాలు, భక్తి భావం ఉట్టిపడేలా ఈ పాటను చిత్రీకరించారు. ఈ కార్యక్రమంలో కొరియోగ్రాఫర్ మనీ మైకేల్, కెమెరామెన్ కమలి పటేల్ తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *