పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 బోధన్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న సీఎం కప్ క్రీడాల నిర్వహణలో భాగంగా శనివారం సాలూర మండల కేంద్రంలో మండల ప్రజాపరిషత్ వారి ఆధ్వర్యంలో శనివారం మండల ప్రజా పరిషత్ కార్యాలయం వద్ద క్రీడా కాగడాను ప్రదర్శించి మండల ఎంపీడీవో శ్రీనివాస్ ర్యాలీని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శశిభూషణ్,రూరల్ ఎస్సై మచ్చెందర్ రెడ్డి, ఎంఈఓ రాజీ మంజూష ర్యాలీలో పాల్గొన్నారు.మండల ప్రజా పరిషత్ కార్యాలయం నుండి గాంధీ విగ్రహం వరకు ర్యాలీగా వెళ్లి తిరిగి మండల ప్రజా పరిషత్ కార్యాలయాని చేరుకుంది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సొక్కం లావణ్య రవి, ఉపసర్పంచ్ బుయ్యన్ సురేష్ పటేల్, ఇల్తెపు శంకర్, హున్సా సర్పంచ్ శివకుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, పంచాయతీ కార్యదర్శులు, యువకులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.