సాలూర మండలంలో పి.ఆర్.టి.యు డైరీ ఆవిష్కరణ

★ ఆవిష్కరించిన మండల అధికారులు

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 18 బోధన్ :సాలూర మండల పి.ఆర్.టి.యు శాఖ ఆధ్వర్యంలో పి.ఆర్.టి.యు డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మండల తావాసిల్దార్ శశిభూషణ్, సాలూర మండల ప్రజా పరిషత్ అధికారి శ్రీనివాస్ మండల విద్యాశాఖ అధికారి రాజీమంజూష సంయుక్తంగా పి.ఆర్.టి.యు డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల వృత్తి పరమైన అభివృద్ధికి ఇటువంటి డైరీలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని, విద్యా రంగంలో నాణ్యత పెంపుకు పి.ఆర్.టి.యు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పి.ఆర్.టి.యు మండల అధ్యక్షులు గంధపు సాయిలు, ప్రధాన కార్యదర్శి సింగారి లక్ష్మణ్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు గోవర్ధన్, మండల అసోసియేట్ అధ్యక్షులు శంకర్, మహిళా ఉపాధ్యక్షురాలు శ్రీమతి సుధారాణి, మండల సహాయ కార్యదర్శి ఫక్రుద్దీన్, పలువురు ప్రాథమిక సభ్యులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.