సిరిపురం యువకుడికి ప్రభుత్వ ఉద్యోగం: గ్రూప్-3లో సత్తా చాటిన నాగరాజు

పయనించే సూర్యడు జనవరి 18 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు ​నడిగూడెం, పట్టుదల ఉంటే పేదరికం అడ్డుకాదని నిరూపించాడు సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం సిరిపురం గ్రామానికి చెందిన కొత్తపల్లి నాగరాజు నిరుపేద కుటుంబంలో పుట్టి, కష్టాలనోర్చి చదివిన నాగరాజు. ప్రభుత్వం ఇటీవలే విడుదల చేసిన గ్రూప్-3 ఫలితాల్లో విజయం సాధించి, రెవెన్యూ విభాగంలో ఉద్యోగం సంపాదించారు. ​నిరుపేద కుటుంబం నుండి రెవెన్యూ శాఖకు.. ​నాగరాజ్ తండ్రి ముత్తయ్య సాధారణ కూలీ పనులు చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. తండ్రి పడుతున్న కష్టాన్ని చూసి, ఎలాగైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో నాగరాజు పట్టుదలగా చదివారు. నిన్న హైదరాబాద్‌లో ప్రభుత్వం నిర్వహించిన కార్యక్రమంలో నాగరాజు తన అపాయింట్‌మెంట్ ఆర్డర్‌ను అందుకున్నారు. ​గ్రామస్తుల ఘన సన్మానం ​నాగరాజ్ సాధించిన విజయం పట్ల సిరిపురం గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. శనివారం గ్రామంలో జరిగిన కార్యక్రమంలో సర్పంచ్ వెంపటి రామారావు గారు, ఉప సర్పంచ్ కొత్తపల్లి రమేష్ గారు నాగరాజు ను ప్రత్యేకంగా అభినందించి సత్కరించారు. ​ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, “మాలాంటి చిన్న గ్రామం నుండి ఒక నిరుపేద యువకుడు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం మాకందరికీ గర్వకారణం. నాగరాజు విజయం గ్రామంలోని మరికొంతమంది విద్యార్థులకు స్ఫూర్తినిస్తుంది” అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నాగరాజు కు శుభాకాంక్షలు తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *