సీఎం కప్ – 2025 క్రీడలకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి.

* ఎంపీడీఓ వీరేశం

పయనించే సూర్యుడు జనవరి 18 భీమదేవరపల్లి:- రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘సీఎం కప్ – 2025’ క్రీడలు శనివారం నుండి ప్రారంభం కానున్నాయని మండల పరిషత్ అభివృద్ధి అధికారి వీరేశం ఒక ప్రకటనలో తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులలో ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ప్రభుత్వం ఈ పోటీలను నిర్వహిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ క్రీడల్లో పాల్గొనదలచిన క్రీడాకారులు శనివారం నుండి తమ పేర్లను ఆన్‌లైన్ ద్వారా నమోదు చేసుకోవాలని సూచించారు. గ్రామ పంచాయితీ, మండల, నియోజకవర్గం, జిల్లా స్థాయిలలో ఈ పోటీలు నిర్వహించబడతాయని తెలిపారు. దరఖాస్తుదారులు తమ ఆధార్ కార్డు, ఒక పాస్‌పోర్ట్ సైజు ఫోటోతో అధికారిక వెబ్‌సైట్ https://satg.telangana.gov.in లో నేరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *