పయనించే సూర్యుడు రిపోర్టర్ జగయ్యపేట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట నియోజకవర్గం జనవరి 18 జగ్గయ్యపేట పట్టణం, పోస్ట్ ఆఫీస్ వద్ద ఉన్న సెయింట్ థామస్ సిఎస్ఐ చర్చి గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ వేడుకల్లో పాల్గొన్న జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్-ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు ఈ సందర్భంగా తన్నీరు నాగేశ్వర మాట్లాడుతూ ప్రేమ, కరుణకి ప్రతిరూపం ఏసుక్రీస్తు శాంతి, క్షమాగుణానికి ప్రేరణ వారి బోధనలు, శత్రువుని కుడా ప్రేమించు, ప్రశ్చతాపానికి మించిన శిక్ష లేదని బోధించిన మహోన్నత వ్యక్తి ఏసు ప్రభు అని, కరుణ, ప్రేమ, దాతృత్వం, త్యాగం ఇవన్నీ తన జీవితం ద్వారా మానవాళికి క్రీస్తు అందించిన మహోన్నత సందేశాలు అని అన్నారు,మానవాళిని సత్యపథం వైపు నడిపించేలా ఏసుక్రీస్తు మార్గనిర్దేశం చేశారు అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు బూడిద నరసింహారావు, మండల రైతు విభాగ అధ్యక్షులు గూడపాటి శేషగిరిరావు, గోపినేని పాలెం గ్రామ పార్టీ అధ్యక్షులు కామినేని రాంబాబు, మాజీ మార్కెట్ యార్డ్ డైరెక్టర్ మన్నే అప్పారావు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
