పయనించే సూర్యుడు జనవరి 18 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రావణ్ కుమార్ బీసీ ఉద్యమ నేత, ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నకు పుట్టినరోజు సందర్భంగా బిజినపల్లి మండల కేంద్రం, వట్టెం గ్రామానికి చెందిన నాయకులు హైదరాబాద్‌కు వెళ్లి మల్లన్నని మర్యాదపూర్వకంగా కలసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అబ్బకరుణకర్ ముదిరాజ్, చింతల కురుమయ్య, కుమ్మరి శ్రీశైలం, గుళ్ళరాము వడ్డే శేఖర్, పద్మ శ్రీశైలం, వడ్డే రామచంద్రయ్య తదితరులు పాల్గొని మల్లన్న నాయకత్వాన్ని ప్రశంసించారు. బీసీ వర్గాల హక్కుల సాధన కోసం నిరంతరం పోరాటం చేస్తున్న మల్లన్న సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు. మల్లన్న శుభాకాంక్షలు తెలిపిన వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, బీసీ ఉద్యమాన్ని మరింత బలోపేతం చేసే దిశగా తన పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
