అడిషనల్ డివిజనల్ రైల్వే మేనేజర్ రామారావుకు ఘన స్వాగతం

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 19 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. పలాస నియోజకవర్గం మందస మండలం గెడ్డ ఊరు గ్రామానికి చెందిన కుందు రామారావు ఇటీవల విశాఖ రైల్వే డివిజన్ అడిషనల్ మేనేజర్ గా ఎంపిక అయినందుకు ఆ గ్రామ ప్రజలు ఆయనకు ఘనముగా సన్మానం చేశారు. ఆయన తొలిసారి గ్రామానికి చేరుకున్న వెంటనే గ్రామస్థులు, యువకులు మహిళలు మంగళ వాయిద్యాల మధ్య ఆయనకు ఘన స్వాగతం పలికారు.గ్రామానికి తొలిసారిగా చేరుకున్న ఆయనకు గ్రామస్థులు, పెద్దలు, మహిళలు పూలతో, బాణ సంచా మధ్య ఆయనకు మంగళ వాయిద్యాలతో గ్రామానికి స్వాగతం పలికారు.ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ మారుమూల గ్రామానికి చెందిన రామారావు రైల్వేలో ఉద్యోగం చేస్తున్నప్పటికీ యుపిఎసీ రాసి , అడిషనల్ రైల్వే డివిజినల్. మేనేజర్ గా ఎంపిక కావడం యువతకు స్పూర్తి దాయకమని అన్నారు. తితిలీ సమయమే కాకుండా ఇతర ఏ సమస్యలు గ్రామానికి వచ్చినా నేనున్నాని ఆర్థిక సాయమందించే మనసున్న వ్యక్తి అని కొనియాడారు.. భారతీయ రైల్వేల అభివృద్ధికి గాను జపాన్ వెళ్ళి అక్కడి రైల్వే పనితీరుపై అవగాహనకు ప్రభుత్వం పంపిన అధికారులతో ఈయన పాల్గొనడం గొప్ప విషయమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని గొప్ప ఉద్యోగం సంపాదించడం పై గ్రామస్థులు గర్వంగా చెప్పుకుంటున్నారని తెలిపారు. రామారావు మాట్లాడుతూ తపనతో చదివి స్థిరపడాలని ఉద్యోగం గౌరవన్నీ తెచ్చి పెడుతుందని యువత మంచి ఉద్యోగాలు సంపాదించాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో యువత మహిళలు పాల్గొన్నారు.