ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దాం.

పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 19 పలాస నియోజకవర్గం ప్రతినిధి రత్నాల రమేష్. నందమూరి తారక రామారావు 30 వ వర్ధంతి సందర్భముగా పలాస తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ నాయకులు ఘనముగా నివాళులు అర్పించారు.. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఆశయాలను కొనసాగిద్దామంటూ నినాదాలు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో ఎన్టీఆర్ తెచ్చిన అనేక సంక్షేమ పథకాలతో ఈరోజు ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటున్నారని అన్నారు. ఎన్టీఆర్ స్థాపించిన టిడిపిని నారా చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా నిర్వహిస్తున్నారని, ఆయన నాయకత్వంలో తామంతా రాష్ట్ర అభివృద్ధికి పాటు పడతామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ముఖ్య నాయకులు, పిరుకట్ల విఠల్ రావు, వజ్జ బాబురావు, లోడగల కామేశ్వరరావు,బడ్డ నాగరాజు, గాలి కృష్ణారావు, గురిటి సూర్యనారాయణ, రవిశంకర్ గుప్తా, చిన్ని, డి శంకర్ తదితరులు పాల్గొన్నారు