ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయం: ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి

పయనించే సూర్యడు / జనవరి 19/ ఉప్పల్ ప్రతినిధి సింగం రాజు దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారకరామారావు (ఎన్టీఆర్) 30వ వర్ధంతి సందర్భంగా కాకతీయ సేవా సమితి ఆధ్వర్యంలో హెచ్‌బీకాలనీ ప్రధాన కూడలిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో భాగంగా ఆయన విగ్రహానికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్, మాజీ కార్పొరేటర్లు గుండారపు శ్రీనివాస్ రెడ్డి, కొత్త రామారావు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ యుగపురుషుడని, తెలుగు రాష్ట్రాలకు ఆయన చేసిన సేవలు మరువలేనివని అన్నారు. ప్రతి పేద కుటుంబంలో వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. విజయం సాధించాలంటే అకుంఠిత దీక్ష అవసరమని మాటలతోనే కాకుండా చేతలతో చేసి చూపించిన నాయకుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడిగా, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడిగా నందమూరి తారకరామారావు ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నారని తెలిపారు. సినీ నటుడిగా, ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో టీజీకే మూర్తి, తెలుగుదేశం ట్రస్ట్ భవన్ ప్రతినిధులు, రాంబాబు, గడ్డిపాటి సాయి (చిన్నా), కాసం మహిపాల్ రెడ్డి, వంజరి ప్రవీణ్ కరిపే, మునుగంటి రాంప్రదీప్, బోదాసు లక్ష్మీనారాయణ, సాంబశివరావు, మేక ప్రసాద్, మధు, మల్లేష్ గౌడ్, వీరభద్రరావు, నవీన్ గౌడ్, రామకృష్ణ, శేఖర్ గౌడ్, యాదగిరి, చారి, బాలయ్య గౌడ్, నిసార్తో పాటు వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.