పయనించే సూర్యుడు, 19 జనవరి 2026, భీంగల్ మండల ప్రతినిధి కొత్వాల్ లింబాద్రి ,నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని చౌటుపల్లి గ్రామానికి చెందిన దివంగత నేత ఏలేటి మహిపాల్ రెడ్డి వర్ధంతి సందర్భంగా ఆదివారం రోజున ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ముందుగా ఆర్మూర్ పట్టణంలో గల మహిపాల్ రెడ్డి విగ్రహానికి ఏమిటి అన్నపూర్ణమ్మ, మల్లికార్జున్ రెడ్డి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, నాయకులు చౌటుపల్లి గ్రామంలోని మహిపాల్ రెడ్డి స్మారక స్థూపం వద్దకు చేరుకొని మౌనం పాటించి సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ పట్టణ అధ్యక్షుడు కనికరం మధు, యోగేశ్వర్ నరసయ్య, లక్ష్మణ్ గౌడ్, సంధ్యా రాజ్, యోగిని శ్రీనివాస్, అశోక్, పీరి గంగాధర్, రాగి అజయ్, తోపారం సురేందర్, నిచ్చం నవీన్, దయ్య ప్రవీణ్, నీలం గంగాధర్ మరియు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు