
పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 19 (శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) మండల కేంద్రమైన యాడికి నందు నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేసి అనంతరం పూలమాలలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా టి.డి.పి. మండల కన్వీనర్ దడియాల ఆదినారాయణ మాట్లాడుతూ ఆ మహనీయుడికి సినీ వినీలాకాశంలో ధృవతారగా వెలిగి, రాజకీయ కురుక్షేత్రంలో అజేయుడైన ‘అన్న’ ఎన్టీఆర్ తరతరాల చరిత్రను తిరగరాసిన ధీరోదాత్తుడు,తెలుగు వారి ఆత్మగౌరవాన్ని ఆకాశమంత ఎత్తులో నిలబెట్టేందుకు పోరాటం చేసిన ఆయన మనందరికీ ప్రాతఃస్మరణీయుడు. కిలో రెండు రూపాయల బియ్యం, సామాజిక భద్రతా పింఛన్లు, పక్కా ఇళ్ల నిర్మాణం, రైతుకు విద్యుత్, మండల వ్యవస్థతో స్థానిక స్వపరిపాలన, ఆడబిడ్డలకు ఆస్తిలో హక్కు, రాయలసీమకు సాగు, తాగునీటి ప్రాజెక్టులు లాంటి అనితరసాధ్యమైన సంక్షేమ అభివృద్ధి పథకాలతో చరిత్ర గతిని మార్చిన ఆ మహనీయుడు మనకు ఆదర్శం. అని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్రెసిడెంట్ వెలిగండ్ల ఆదినారాయణ, బి.సి.సెల్ అధ్యక్షుడు తిరంపురం రంపురం నీలకంఠ, మాజీ ఎం.పీ.పీ.వేలూరి రంగయ్య, సీనియర్ నాయకులు గొర్తిరుద్రమ నాయుడు, మాదాల అనిల్ కుమార్, మార్కెట్ యార్డ్ డైరెక్టర్ పరిమి శ్రీహరి, పరిమిచరణ్, మధురాజ్, బొట్టుశేఖర్, నెట్టికంటయ్య, రాజశేఖర్, చిట్టి బాబు, దాసరి రామచంద్ర, సుభహాన్, విశ్వనాథ్, సెల్ పాయింట్ చాంద్ బాషా, కోటవీధి సెక్ష, రహంతుల్లా, ఫైబర్ చందు, ఫిరోజ్ బాషా, హాజీ పీరా, మహమ్మద్ రఫీ, తెల్లాకుల కేశవ, నంద్యాల రంగస్వామి, తదితర తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు, జె.సి. అభిమానులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..