పయనించే సూర్యుడు న్యూస్ జనవరి 19 యడ్లపాడు మండల ప్రతినిధి.. యడ్లపాడు మండలం, మర్రిపాలెం: యడ్లపాడు మండలం మర్రిపాలెం గ్రామానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్‌సీ సెల్ అధ్యక్షుడు వలేటి ఉదయ్ కిరణ్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం యడ్లపాడు మండల వైసీపీ పార్టీ అధ్యక్షుడు వడ్డేపల్లి నరసింహారావు అధ్యక్షతన ఉత్సాహంగా జరిగింది. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఉదయ్ కిరణ్ గారికి పూలమాలలు వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించగా, కార్యక్రమం అంతటా ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా మాట్లాడిన వడ్డేపల్లి నరసింహారావు గారు, వలేటి ఉదయ్ కిరణ్ పార్టీకి నిబద్ధత కలిగిన నాయకుడిగా, ఎస్సీ వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారని ప్రశంసించారు. పార్టీ బలోపేతం కోసం ఇలాంటి యువ నాయకులు ముందుండటం అభినందనీయమని తెలిపారు. వలేటి ఉదయ్ కిరణ్ మాట్లాడుతూ, తనపై నమ్మకం ఉంచిన పార్టీ నాయకులకు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో కూడా పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లి, బడుగు బలహీన వర్గాల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు, గ్రామస్థాయి నాయకులు, యువజన విభాగం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు