పయనించే సూర్యుడు జనవరి 19, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). చింతకాని మండలంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఘనంగా నివాళులు కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాతర్లపాడు, నేరడా, లచ్చగూడెం, బొప్పారం, చిన్నమండవ, నాగినికొండ గ్రామాల్లో ఎన్టీఆర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నాయకులు ఘన నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు తేలుకుంట్ల శ్రీనివాసరావు, మాజీ అధ్యక్షులు నున్న తాజావుద్దీన్, మండల ఉపాధ్యక్షులు నన్నకు రామారావు పాల్గొన్నారు. అలాగే సీనియర్ నాయకులు గంట సత్యనారాయణ, గురుజాల చిన్న మాధవ్, పఠాన్ సొందు, పగడపల్లి పానకాలు, యాద రామారావు, పరచగాని గోపి, రేఖం వెంకటేశ్వర్లు, నకులూరి నాగరాజు, ఎస్కే హసన్ సాహెబ్ ,తాళ్లూరి శేషయ్య తదితరులు ఈ గ్రామాల్లో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ, పేదల సంక్షేమం కోసం ఎన్టీఆర్ చేసిన సేవలు చిరస్మరణీయమని ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి తెలుగుదేశం కార్యకర్తపై ఉందని పేర్కొన్నారు.