పయనించే సూర్యుడు జనవరి 19 (ప్రతినిధి గుమ్మకొండ సుధాకర్ డిండి మండలం నల్లగొండ జిల్లా) డిండి మండల కేంద్రంలో తెలుగుదేశం పార్టీ అధినేత నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎన్టీఆర్ సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో కోటప్ప, పోలం శ్రీను, వావిళ్ళ మల్లయ్య, పురుషోత్తం, చిన్నయ్య, గుడి రాములు, సదానందం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొనడం జరిగింది.