పయనించే సూర్యుడు న్యూస్ : జనవరి 19,తల్లాడ రిపోర్టర్ తల్లాడ కల్లూరు మెయిన్ రోడ్ లో గల టీడీపీ దిమ్మె వద్ద ఆదివారం ఎన్టీఆర్ 30 వర్ధంతి సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి టిడిపి నాయకులు ఘనంగా నివాళులర్పించారు. తల్లాడ సర్పంచ్ పెరిక. నాగేశ్వరావు ఎన్టీఆర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ మండల నాయకులు ధూపాటి భద్రరాజు, కూచిపూడి. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ తెలుగు జాతి ఆత్మ గౌరవ పతాకం, విశ్వవిఖ్యాత నటసార్వభౌముడు మహా నాయకుడు ఎన్టీఆర్ 30 వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులర్పించడం జరిగింది. తారక రాముడు పోషించిన పౌరాణిక పాత్రల ఫోటోలను ఇళ్లల్లో పెట్టుకొని ప్రజలు దేవుడిగా పూజిస్తుండటం ఎన్టీఆర్ కి మాత్రమే దక్కిన అరుదైన వరం. మీరు భౌతికంగా దూరమై ఇన్నేళ్లయినా తెలుగు వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన మహోన్నత వ్యక్తి అన్న ఎన్టీఆర్ అన్నారు. ఈ కార్యక్రమం లో తల్లాడ సర్పంచ్ పెరిక. నాగేశ్వరావు, టీడీపీ మండల నాయకులు కొమ్మినేని. రామయ్య, ధూపాటి భద్ర రాజు, కూచిపూడి. వెంకటేశ్వర రావు, రావూరి. రావి ప్రసాద్, నాయకులు గుండ్ల. నాగయ్య, దగ్గుల. శ్రీనివాస రెడ్డి, కొమ్మినేని. రాము, నరసింహారావు, వడ్డే నాగేశ్వరావు, గరిక. వేంకటేశ్వర్లు, చల్లా. నాగయ్య, బిరెడ్డి. మల్లారెడ్డి, కటమనేని.సీతారామయ్య, విలసాగరం. లక్ష్మయ్య (పెద్దబ్బాయి), టీడీపి కార్యకర్తలు ఎన్టీఆర్ అభిమానులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.